Posts

Showing posts from October, 2025

అరేబియా రాత్రులు

Image
 పర్షియా దేశంలో ఒక సుల్తాన్ ఉండేవాడు.  అతను ఎన్నోచోట్ల వెతికి ఒక గుణవంతురాలైన అందమైన స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు.  అతను ఒక్క క్షణం కూడా భార్యను విడవకుండా కాలం గడిపాడు.  కొంతకాలం తర్వాత పరిపాలన గాలికి ఒదిలేయడం మంచిది కాదు అని గుర్తు చేశాడు వజీరు.  అప్పటినుంచి సుల్తాను రాణితో గడిపే సమయం తగ్గించి పాలన చూసుకోవడం ప్రారంభించాడు.  శరీర సుఖానికి రుచి మరిగిన రాణి కొంతకాలం ఆగింది. ఆ తర్వాత ఆగలేకపోయింది.  కోటలో ఎంతోమంది నీగ్రో బానిసలు సేవకులుగా ఉన్నారు.  వారిలో ఒకడ్ని చూసుకొని రంకు ప్రారంభించింది.  ఈ వ్యవహారం కొంతకాలం గుట్టుగా సాగింది.  ఒక దురదృష్టకరమైన రోజున .. రాణి తన ప్రియుడితో కులుకుతుండగా రాజు చూడనే చూశాడు.  అతని హృదయం బద్దలైపోయింది.  రాణిని ప్రాణం కన్నా‍ ఎక్కువగా ప్రేమించాడు అతను.  ఆమె కలలో కూడా తనను మోసం చేయదని నమ్మాడు అతను.  బాధ కోపంగా మారింది సుల్తాన్‌కు.  రాణి, ఆమె నీగ్రో ప్రియుడు రాజు కోపానికి బలైపోయారు.  రాణి చేసిన నమ్మకద్రోహంతో సుల్తాన్ రాక్షసుడిగా మారిపోయాడు.  లోకంలోని స్త్రీలందరూ ఇంతే .. భర్తను నమ్...

ధైర్యలక్ష్మి

 ఎక్కడో చదివిన కథ ఇది. కానీ నూటికి నూరుపాళ్ళు నిజం ఉన్న కథ.  ఒకానొక కాలంలో ఒక రాజు ఉండేవాడు. అతను దానంలో కర్ణుడు. అతని దగ్గర అష్టలక్ష్మిలు కొలువై ఉన్నారు.  ఒకరోజు రాజు దగ్గరకు ఒకాయన వచ్చాడు.  ధాన్యలక్ష్మిని దానం చేయమని కోరాడు.  రాజు ఇచ్చేశాడు.  ఆ తర్వాత ధనలక్ష్మి‍ని ఇవ్వమని కోరాడు.  రాజు ఇచ్చేశాడు .  ఇలా ఏడు లక్ష్ములను ఆయన అడగడం, ఈయన ఇవ్వడం జరిగిపోయాయి.  చివరిది .. ధైర్యలక్ష్మి.  అది కూడా దానం చేయమని ఆయన కోరనే కోరాడు.  'అయ్యా! ఏదైనా ఒదులుకుంటాను గానీ ధైర్యలక్ష్మిని మాత్రం ఒదులుకునే ప్రసక్తి లేదు. అన్నీ పోయినా నా దగ్గర ధైర్యం ఉంటే నేను రాజులా బ్రతుకుతాను. ధైర్యం పోయిందంటే నేను బ్రతికినా చచ్చినట్లే. నా ప్రాణం ఉన్నంతవరకు ధైర్యలక్ష్మిని వదలను.’ అన్నాడు రాజు.  కొంతకాలానికి ధైర్యలక్ష్మి ఉన్నచోటే మేమూ .. అంటూ మిగతా ఏడు లక్ష్మిలు రాజు దగ్గరకు వచ్చేశాయి.  మనరాజు మళ్ళీ మహరాజు అయ్యాడు.  ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోకూడదు అని చెప్పే గొప్ప కథ ఇది.  ఎన్ని సమస్యలు వచ్చినా మనిషి ధైర్యంగా ఉంటే వాటిని ఎదుర్కొని బయటపడగలడు...