ధైర్యలక్ష్మి

 ఎక్కడో చదివిన కథ ఇది. కానీ నూటికి నూరుపాళ్ళు నిజం ఉన్న కథ. 

ఒకానొక కాలంలో ఒక రాజు ఉండేవాడు. అతను దానంలో కర్ణుడు.

అతని దగ్గర అష్టలక్ష్మిలు కొలువై ఉన్నారు. 

ఒకరోజు రాజు దగ్గరకు ఒకాయన వచ్చాడు. 

ధాన్యలక్ష్మిని దానం చేయమని కోరాడు. 

రాజు ఇచ్చేశాడు. 

ఆ తర్వాత ధనలక్ష్మి‍ని ఇవ్వమని కోరాడు. 

రాజు ఇచ్చేశాడు . 

ఇలా ఏడు లక్ష్ములను ఆయన అడగడం, ఈయన ఇవ్వడం జరిగిపోయాయి. 

చివరిది .. ధైర్యలక్ష్మి. 

అది కూడా దానం చేయమని ఆయన కోరనే కోరాడు. 

'అయ్యా! ఏదైనా ఒదులుకుంటాను గానీ ధైర్యలక్ష్మిని మాత్రం ఒదులుకునే ప్రసక్తి లేదు. అన్నీ పోయినా నా దగ్గర ధైర్యం ఉంటే నేను రాజులా బ్రతుకుతాను. ధైర్యం పోయిందంటే నేను బ్రతికినా చచ్చినట్లే. నా ప్రాణం ఉన్నంతవరకు ధైర్యలక్ష్మిని వదలను.’ అన్నాడు రాజు. 

కొంతకాలానికి ధైర్యలక్ష్మి ఉన్నచోటే మేమూ .. అంటూ మిగతా ఏడు లక్ష్మిలు రాజు దగ్గరకు వచ్చేశాయి. 

మనరాజు మళ్ళీ మహరాజు అయ్యాడు. 

ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యాన్ని కోల్పోకూడదు అని చెప్పే గొప్ప కథ ఇది. 

ఎన్ని సమస్యలు వచ్చినా మనిషి ధైర్యంగా ఉంటే వాటిని ఎదుర్కొని బయటపడగలడు. 

- సాయికిరణ్ పామంజి , 09-10-25

Comments

Popular posts from this blog

అంతా మిథ్యే

అరేబియా రాత్రులు